కంచె.. బలితీసుకుంది!

16 Dec, 2018 05:35 IST|Sakshi

బెంగళూరు: ఏనుగులను కాపాడేందుకు వేసిన కంచె.. ఓ గజరాజు పాలిట శాపంగా మారింది. కర్ణాటకలోని నగర్‌హోళె జాతీయ పార్కులో ఈ విషాదం జరిగింది. ఓ ఊరిలోకొచ్చిన ఏనుగును స్థానికులు తరమడంతో కంచెను దాటబోయి ఇరుక్కుపోయింది. దీంతో తన బరువుకు ఊపిరాడక మృతి చెందింది. రైళ్లు ఢీకొని ఏనుగులు చనిపోకుండా ఉండే ందుకు రక్షణగా గతంలో రైలుపట్టాలకు ఇరువైపులా రూ.212 కోట్లతో ఈ కంచెను రైల్వేశాఖ నిర్మించింది. ఏనుగును జాతీయ పార్కులోని వీరహోసహళ్లి రేంజ్‌లోకి తరిమేందుకు జనం ప్రయత్నించారని అటవీ అధికారులు తెలిపారు. కంచెపై చిక్కుకోవడంతో తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతోనే ఊపిరితిత్తుల్లో గాయమై ఏనుగు మరణించి ఉంటుందని అధికారులు వివరించారు.

మరిన్ని వార్తలు