100 ఇళ్లను ధ్వంసం చేసిన గజరాజు

11 Feb, 2016 00:42 IST|Sakshi
100 ఇళ్లను ధ్వంసం చేసిన గజరాజు

కోలకతా: ఆ గజరాజుకు కోపం వచ్చిందో, ఆకలి వేసిందో, మరేమైందో తెలియదు గానీ.. ఉన్నట్టుండి జనావాసాల్లోకి ప్రవేశించింది. వచ్చింది వచ్చినట్లు తిన్నగా ఉంటుందా.. ఇళ్లన్నింటినీ ధ్వంసం చేసి వదిలిపెట్టింది. పశ్చిమబెంగాల్ లోని సిలిగురిలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. అది అకస్మాత్తుగా జనావాసాల్లోకి చొచ్చుకురావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.  

ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు గానీ... ఆగ్రహంతో చెలరేగిపోయింది. దాదాపు వంద ఇళ్లను ధ్వంసం చేసింది. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. ఆందోళన చెందిన స్థానికులు పోలీసులకు,  అటవీ అధికారులు సమాచారం అందించారు. అటవీ అధికారులు ఏనుగును బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా అటవీ ప్రాంతంలో చెట్లు నరికేయడం వల్ల తగినంతగా ఆహారం లభించనప్పుడు, లేదా తప్పిపోయిన తమ పిల్లలను వెతుక్కుంటూ మాత్రమే ఏనుగులు ఇలా జనావాసాల్లోకి వస్తాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. మరి ఇది ఎందుకు వచ్చిందన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు