'18 ఏళ్లు దాటిన కొడుకును వదిలేయండి'

19 Mar, 2016 15:03 IST|Sakshi
'18 ఏళ్లు దాటిన కొడుకును వదిలేయండి'

అహ్మదాబాద్: పద్దెనిమిదేళ్లు దాటిన కొడుకు బాధ్యతను తల్లిదండ్రులు చూసుకోవాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వయసుకు వచ్చిన కుమారులకు వారి సంపాధన వారే చూసుకోవాలని చెప్పొచ్చని తెలిపింది. అయితే, ఆ కొడుకు మానసికంగా, శారీరకంగా బలహీనమైతే తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని చెప్పింది. కానీ, కూతురు విషయంలో ఈ నిబంధన వర్తించదని, ఆడపిల్ల మైనారిటీ తీరినా ఆమె వివాహం అయ్యే వరకు తల్లిదండ్రులే చూసుకోవాలని చెప్పింది.

గుజరాత్లో వైద్యుడిగా పనిచేస్తున్న దినేశ్ ఓజా అనే వ్యక్తికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ తీర్పు చెప్పింది. 2006లో ఆయనకు తన భార్యకు విడాకులు అయ్యాయి. ఆ సమయంలో 18 ఏళ్లు వచ్చే వరకు కొడుకు బాధ్యతను ఆ వైద్యుడే చూసుకోవాలని అలహాబాద్ ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. దీంతో అతడు తన కుమారుడికి 18 ఏళ్లురాగానే 2013 అక్టోబర్ నెల నుంచి చెల్లింపులు ఆపేశాడు. ఈ చర్యతో తన మాజీ భార్య మరోసారి ఫ్యామిలీ కోర్టుకు వెళ్లగా హైకోర్టును ఆశ్రయించండని చెప్పింది. దీంతో ఆమె హైకోర్టు వెళ్లగా అదే విషయాన్ని స్పష్టం చేసింది. ఏతల్లిదండ్రులయినా కేవలం 18 ఏళ్ల వరకు కుమారుడిని చూసుకుంటే సరిపోతుందని అన్నారు.

మరిన్ని వార్తలు