తీవ్ర విషాదాన్ని మిగిల్చిన స్టడీ టూర్‌

8 Sep, 2017 08:51 IST|Sakshi
తీవ్ర విషాదాన్ని మిగిల్చిన స్టడీ టూర్‌

పనాజి:  విద్యార్థుల స్టడీ టూర్‌ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.  మికా  యూనివర్శిటీ   విద్యార్థుల స్టడీ టూర్‌  ఇద్దరు తెలివైన విద్యార్థుల  పాలిట మృత్యుపాశమైంది. గోవాలోని కండోలిం బీచ్ వద్ద  గురువారం ఉదయం  చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో  అనూజా సుసాన్ పాల్ ,  గుర్రంచెంచు సాయి జ్ఞానేశ్వర్‌ అనే ఇద్దరు విద్యార్థులు  దుర్మరణం పాలయ్యారు.

క్రాఫ్టింగ్ క్రియేటివ్ కమ్యూనికేషన్ (సీసీసీ)  ప్రోగ్రాంలో భాగంగా  47 మంది మికా విద్యార్ధులు గోవా వెళ్లారు.  ఈ సందర‍్భంగా అక్కడ బీచ్‌కు వెళ్లినపుడు ప్రమాదవశాత్తూ ఇద్దరు  బీచ్‌లో కొట్టుకుపోయారు. స్థానికుల సహాయంతో అంజు మృతదేహాన్ని, ఐదు గంటల తరువాత జ్ఞానేశ్వర్‌  బాడీని గుర్తించారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు,  సహచర విద్యార్థులు కన్నీటి సంద్రమయ్యారు.

పౌర్ణమి రాత్రి   కావడంతో గురువారం తెల్లవారుఝామున 3 గంటల సమయంలో, ఆరుగురు  విద్యార్థుల బృందం కండోలిం బీచ్‌కు  వెళ్లారని, దురదృష్టవశాత్తు ఇద్దరు మునిగిపోయి, ప్రాణాలను కోల్పోయారని ఇన్సిస్టిట్యూట్ జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. వెంటనే ఈ దుర్ఘటనపై  తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందించామని  అసోసియేట్ డీన్ సిద్దార్థ్ దేశ్‌ముఖ్‌ తెలిపారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్ర‍్భాంతిని వ్యక‍్తం చేశారు. ఇది తీవ్ర విషాదమంటూ వారి ఆత్మకుశాంతి కలగాలన్నారు.  ఇద్దరు కో-ఆర్డినేటర్లు సహా ప్రొ. ప్రవీణ్‌ మిశ్రా, సీసీసీ ప్రోగ్రాం డైరెక్టర్‌  ప్రొ. నితేశ్‌ మొహంతి విద్యార్థులతో ఉన్నట్టు చెప్పారు.  అక్కడి పరిస్థితిని మికా  బృందం పరిస్థితిని  పరిశీలిస్తోందని, బాధితులకు పూర్తి  సహాయం అందిస్తున్నామని ఆయన చెప్పారు.   
 

మరిన్ని వార్తలు