ఇందులో పిల్లి ఎక్కడుందిరా బాబూ?

9 Jun, 2020 20:52 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇక్క‌డో పిల్లి దాగుడు మూత‌లు ఆడుతోంది. అది ఎక్క‌డుందో క‌నిపెట్ట‌మంటూ స‌వాలు విసురుతోంది. అస‌లే మార్జాలం. ఎక్క‌డైనా దూర‌గ‌ల‌దు, ఎందులోకైనా చొచ్చుకుపోగ‌ల‌దు. అలాంటిది. ఇన్ని పుస్త‌కాల దొంత‌ర‌ల మ‌ధ్య దాన్ని గుర్తించ‌డం కాస్త క‌ష‌్ట‌మే అయ్యేటట్టుంది. ఇంత‌కీ ఈ పజిల్‌ను కేట్ హైండ్స్ అనే వ్య‌క్తి ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. "ఈ రోజు పిల్లిని ప‌ట్టుకుందాం" అంటూ దానికి క్యాప్ష‌న్ జోడించాడు. ఓస్, అదెంత ప‌ని.. వెతికేద్దాం అని ప్ర‌య‌త్నించిన‌ కొంద‌రు నెటిజ‌న్లు అందులో పిల్లి ఎక్కడుందిరా బాబూ? అంటూ దాన్ని గుర్తించ‌లేక‌ జుట్టు పీక్కుంటున్నారు. (డిస్ట్రబ్‌ చేసింది.. స్టార్‌ అయ్యింది)

పుస్త‌కాలు, చెట్లు, టీవీతో అంగుళం కూడా ఖాళీ లేకుండా నిండిపోయిన ఫొటోలో దాన్ని ప‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మేనంటూ మ‌రికొంద‌రు ముందే చేతులెత్తేస్తున్నారు. అతి కొద్ది మంది మాత్రం పిల్లి దొరికిందోచ్ అంటూ దాని ఫొటోను షేర్ చేస్తూ ఎగిరి గంతేస్తున్నారు. ఇక మిగిలిన‌ ‌వారు మాత్రం తాము కూడా పిల్లుల‌తో ఇలాగే దాగుడుమూత‌లు ఆడ‌తామంటూ అందుకు సంబంధించిన వీడియోల‌ను షేర్ చేస్తూ ప‌జిల్‌ను ప‌క్క‌న పెట్టేశారు. (మానవత్వానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఈ వ్యక్తి!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు