ఎంపీ గవర్నర్పై ఎఫ్ఐఆర్

23 Feb, 2015 17:39 IST|Sakshi

మధ్యప్రదేశ్లో సంచలం రేపిన పరీక్షలు, ఉద్యోగ నియమాకాల కుంభకోణంలో ఆ రాష్ట్ర గవరర్నర్ రామ్నరేశ్ యాదవ్పై   కోర్టు అంగీకారం తెలపడంతో మంగళవారం నాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది

మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (ఎంపీపీఈబీ) నిర్వహించిన పరీక్షలు, ఉద్యోగాల నియమకాల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెలువెత్తడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. కుంభకోణం ప్రధాన సూత్రధారి గవర్నర్ రాంనరేశ్ యాదవ్ కుమారుడేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గవర్నర్ పాత్రపైనా అనేక ఆరోపణలు వినవచ్చాయి. ఈ నేపథ్యంలో  అటు కుమారుడితో పాటు తండ్రినీ విచారించేందుకు టాస్క్ ఫోర్స్ సిద్ధమైంది. రాంనరేశ్ రాజ్యాంగ పదవిలో ఉండటంతో హైకోర్టు అనుమతితో ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.

మరిన్ని వార్తలు