ప్రొఫెసర్లకు గుడ్ న్యూస్

27 Jun, 2017 09:43 IST|Sakshi
న్యూఢిల్లీ : ఉన్నత విద్యాసంస్థల ఫ్యాకల్టీ, స్టాఫర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఎన్నో రోజుల నుంచి వేచిచూస్తున్న వేతనాల సవరణను ప్రభుత్వం చేపడుతోంది. ఈ సవరణతో ఉద్యోగుల వేతనాలు సగటును 15 శాతం మేర పెరుగనున్నాయి. గురుపూర్ణిమ(జూలై9) సందర్భంగా వీరికి గుడ్ న్యూస్ చెప్పాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనను సిద్ధం చేసిన మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ దీన్ని కేబినెట్ ముందుకు తీసుకువస్తోంది. దీనిపై కేబినెట్ ఆమోదం తెలుపగానే, దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలకు చెందిన ఎనిమిది లక్షల మంది ఫ్యాకల్టీ, స్టాఫ్‌ కు 15 శాతం మేర వేతనాలు పెరుగనున్నాయని తెలిసింది. కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలతో పాటు ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు, ఐఐఎస్ఈఆర్ల ఫ్యాకల్టీ, స్టాఫ్ లకు కూడా ఈ మేరకునే వేతనాలను పెంచనున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. 
 
ఈ వేతనాల పెంపుతో ప్రభుత్వంపై మూడేళ్ల వరకు రూ.75వేల కోట్ల భారం పడనుందని వెల్లడైంది. ఈ విషయంపై పీఎంఓ సోమవారమే సమావేశం ఏర్పాటుచేసింది. చివరి సారిగా వీరి వేతనాలను 2006లో పెంచారు. సివిల్ సర్వెంట్ కంటే అధికంగా వీరి వేతనాలు అప్పట్లో పెంచారు. ఈ వేతనాల పెంపుతో రాష్ట్రప్రభుత్వానికి చెందిన కాలేజీలు, యూనివర్సిటీల 7.5-8లక్షల మంది ఫ్యాకల్టీ, స్టాఫ్ కు ప్రయోజనం చేకూరనుంది. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలకు చెందిన 30వేల మంది ఉద్యోగులకు, కేంద్రప్రభుత్వంతో నడిచే టెక్నికల్ ఇన్ స్టిట్యూట్స్ కు చెందిన 30వేల మందికి ప్రయోజాలను చేకూరనున్నట్టు తెలిసింది. వచ్చే మూడేళ్ల వరకు  ఈ వేతనాల పెంపు అమలు ఉంటుందని, 7వ వేతన సంఘ సిఫారసుల మేరకే వీరికి సగటున 15 శాతం ఇంక్రిమెంట్ చేపడుతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే 20 శాతం వరకు పెంపు చేపట్టాలని యూజీసీ రిపోర్టు చేసింది.   
 
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా