గుజరాత్‌ క్రిమినల్‌ కోడ్‌కు రాష్ట్రపతి ఆమోదం

5 Nov, 2017 13:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌ ఇండస్ట్రియల్‌ అమెండమెంట్‌, గుజరాత్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సహా 9 కీలక బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. 8 రాష్ట్రాలకు చెం‍దిన 9 కీలక బిల్లును రాష్ట్రపతి ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఇందులో ప్రధానంగా 2017 (గుజరాత్‌ రాష్ట్ర చట్టసవరణ) క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ఉండడం గమనార్హం. ఈ చట్టం ద్వారా నిర్భంద ఖైదీలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టుతో మాట్లాడేందుకు అవకాశం కల్పిచడం జరుగుతుందని గుజరాత్‌ అధికారులు తెలిపారు. ఈ చట్ట సవరణ వల్ల కీలక కేసుల్లో శిక్ష పడిన ఖైదీల రక్షణ కల్పించడంతో పాటు, వారిని కోర్టుల చుట్టూ తిప్పే ఇబ్బందులు పోలీసులకు ఉండవని వివరించారు.

కర్ణాటకకు సంబంధించి 2015 నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు బిల్లులకు కోవింద్‌ మోక్షం కల్పించారు. అలాగే కేరళ, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన ఇండస్ట్రియల్‌ బిల్లులకు కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు.

మరిన్ని వార్తలు