తొలి మహిళా ఫ్లైట్‌ ఇంజనీర్‌ హినా జైస్వాల్‌

15 Feb, 2019 17:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత వాయుసేనలో తొలి మహిళా ఫ్లైట్‌ ఇంజనీర్‌గా చండీగఢ్‌కు చెందిన ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ హినా జైస్వాల్‌ చరిత్ర సృష్టించారు. ఫ్లైట్‌ ఇంజనీర్‌కు ప్రత్యేక నైపుణ్యాలతో కూడిన సున్నితమైన విమాన వ్యవస్థలను పర్యవేక్షించడం, ఆపరేట్‌ చేయగల సామర్ధ్యం అవసరం. భారత వాయుసేనకు చెందిన ఆపరేషనల్‌ హెలికాఫ్టర్‌ యూనిట్లలో ఫ్లైట్‌ ఇంజనీర్‌గా హినా విధులు నిర్వర్తిస్తారు.

అత్యంత శీతల ప్రాంతమైన సియాచిన్‌ గ్లేసియర్‌ నుంచి సున్నితమైన పలు ప్రాంతాల్లో ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఫ్లైట్‌ ఇంజనీర్‌గా ఆమె సేవలు అందించాల్సి ఉంటుంది. భారత వాయుసేనలో చేరడం ద్వారా తన చిరకాల స్వప్నం నెరవేరిందని పంజాబ్‌ వర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌ పట్టా పొందిన హినా సంతృప్తి వ్య్తం చేశారు. తనకు చిన్ననాటి నుంచి సైనికుల యూనిఫాం ధరించి ఏవియేటర్‌గా ఆకాశంలో విహరించాలనే ఆసక్తి ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు. ఫ్లైట్‌ ఇంజనీర్‌గా వాయుసేనలో ఆమె గత ఆరు నెలల నుంచి కఠోర శిక్షణ తీసుకున్నారు.

మరిన్ని వార్తలు