ఐఐటీ, ఐఐఎంలతో త్వరగా అక్రిడేషన్‌

9 Sep, 2018 03:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)ల సాయంతో దేశంలోని ఉన్నత విద్యాసంస్థల అక్రిడేషన్‌ ప్రక్రియను త్వరగా చేపడతామని  మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. అక్రిడేషన్‌ కోసం ఏర్పాటు చేసే కొత్త కమిటీలో చేరేందుకు ముందుకురావాలని ఐఐటీ, ఐఐఎంలను కోరామన్నారు. ఇంతకాలం 15 శాతం ఉన్నత విద్యాసంస్థల్లోనే అక్రిడేషన్‌ను చేశామని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు జాతీయ మదింపు, గుర్తింపు మండలి(న్యాక్‌), జాతీయ గుర్తింపు మండలి(ఎన్‌బీఏ)లను విస్తరిస్తామన్నారు. పాఠశాల విద్యార్థులు నిరక్షరాస్యులకు చదువు చెప్పేలా కొత్త పథకాన్ని తెస్తామని జవదేకర్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు