గుడ్‌న్యూస్‌: 1న కేరళకు రుతుపవనాలు

28 May, 2020 19:00 IST|Sakshi

ఈశాన్య రాష్ట్రాలకు వర్షసూచన

సాక్షి, న్యూఢిల్లీ : నిప్పులకొలిమిని తలపిస్తున్న మండే ఎండల నుంచి ఉపశమనంలా చల్లని కబురు అందింది. జూన్‌ 1న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఉపరితల శాస్ర్తాల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ మాల్దీవులు-కొమోరిన్‌ ప్రాంతంతో పాటు దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్‌-నికోబార్‌ దీవులకు చేరుకున్నాయి.

మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. ఇక రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీలు తగ్గుతాయని శుభవార్త అందించింది. ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

చదవండి : 24 గంటల్లో దేశంలోకి ‘నైరుతి’

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా