తొలి మహిళా ఐఏఎస్‌ అధికారిని కన్నుమూత

18 Sep, 2018 10:59 IST|Sakshi

ముంబై: భారతదేశ స్వాతంత్ర్యం అనంతరం మొట్టమొదటి మహిళా ఐఏఎస్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించిన అన్నా రాజమ్ మల్హోత్రా(91) కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. 1951లో ఆమె సివిల్ సర్వీస్‌లో చేరి మద్రాస్‌లో పనిచేశారు. అప్పటి సీఎం సీ. రాజగోపాలచారి ప్రభుత్వంలో ఆమె కీలక బాధ్యతలు చేపట్టారు. 

కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో 1927, జూలైలో అన్నా రాజమ్ జార్జ్ జన్మించారు. కోజికోడ్‌లో స్కూల్ విద్యను, తర్వాత మద్రాస్‌లో ఉన్నతవిద్యను అభ్యసించారు. 1985 నుంచి 1990 వరకు ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన ఆర్‌ఎన్.మల్హోత్రాను ఆమె పెళ్లి చేసుకున్నారు. గుర్రపు స్వారీ, షూటింగ్‌లోనూ అన్నా శిక్షణ పొందారు. మొదటిసారి హోసూరు సబ్ కలెక్టర్‌గా చేశారు. ఏడుగురు సీఎంల వద్ద ఆమె ఆఫీసర్‌గా చేశారు. 1982 ఢిల్లీలో జరిగిన ఏషియన్ గేమ్స్ ప్రాజెక్టుకు ఇంచార్జ్‌గా చేశారు. అన్నా రాజమ్‌ మృతిపట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు