ఎల్‌ఈడీ సినిమా తెర

3 Sep, 2018 04:12 IST|Sakshi

ఇప్పటి వరకు ఎల్‌ఈడీ టీవీలనే చూశాం. ఇకపై సినిమా థియేటర్లలో కూడా ఎల్‌ఈడీ తెరను చూడవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో పీవీఆర్‌ మల్టీప్లెక్స్‌లో ఎల్‌ఈడీ తెరను ఇటీవల ఏర్పాటు చేశారు. దేశంలో మొట్టమొదటి ఎల్‌ఈడీ సినిమా తెర ఇదే. శామ్‌సంగ్‌ సంస్థ సహకారంతో ఏర్పాటు చేశారు. మామూలు తెరతో పోలిస్తే ఎల్‌ఈడీ తెరపై సినిమా మరింత ప్రకాశవంతంగా స్పష్టంగా కనిపిస్తుందని, శబ్దం కూడా క్లియర్‌గా ఉంటుందని పీవీఆర్‌ మల్లీప్లెక్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ బిజ్లి చెప్పారు.

ఎల్‌ఈడీ తెరకు ప్రొజెక్టర్‌ అవసరం ఉండదు. మామూలుగా సినిమా నడిచేటప్పుడు హాల్లో లైట్లన్నీ ఆర్పేస్తారు. అయితే, ఎల్‌ఈడీ తెర ఉంటే లైట్లు ఆర్పాల్సిన అవసరం లేదు. థియేటర్‌లో లైట్లు ఉన్నా సినిమా చూడటా నికి ప్రేక్షకులకు ఇబ్బంది ఉండదు. ఈ తెర ఏర్పాటుకు రూ.7 కోట్లు ఖర్చయింది. 2017లో తొలిసారిగా కొరియాలో ఎల్‌ఈడీ తెర(ఆనిక్స్‌ స్క్రీన్‌)ను పరిచయం చేశామని, ఇంతవరకు ప్రపంచంలో 12 చోట్ల ఈ తెర లున్నాయని శామ్‌సంగ్‌ ప్రతినిధి చెప్పారు.

మరిన్ని వార్తలు