-

సింగర్‌ ఎల్లీ మంగట్‌ హత్యకు కుట్ర..అర్షదీప్‌ ముఠా సభ్యుల అరెస్ట్‌

28 Nov, 2023 06:15 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని మయూర్‌ విహార్‌లో సోమవారం ఉదయం జరిగిన స్వల్ప ఎదురుకాల్పుల అనంతరం గ్యాంగ్‌స్టర్‌ అర్షదీప్‌ సింగ్‌ ముఠాకు చెందిన ఇద్దరు షార్ప్‌షూటర్లను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిని రాజ్‌ప్రీత్‌ సింగ్‌(25), వీరేంద్ర సింగ్‌(22)గా గుర్తించారు.

పంజాబీ గాయకుడు ఎల్లీ మంగట్‌ను చంపేందుకు వీరు పథక రచన చేసినట్లు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌ సమయంలో అయిదు రౌండ్ల వరకు తుపాకీ కాల్పులు జరపగా, రెండు బుల్లెట్లు పోలీసు అధికారి బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ను తాకాయన్నారు. ప్రతిగా పోలీసులు ఆరు రౌండ్ల వరకు జరిపిన కాల్పుల్లో వీరేంద్ర సింగ్‌ కుడి కాలికి గాయమైంది. ఎన్‌కౌంటర్‌ అనంతరం నిందితులిద్దరినీ ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించామన్నారు. వీరి నుంచి రెండు రివాల్వర్లు, ఒక హ్యాండ్‌ గ్రెనేడ్, చోరీ చేసిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు