ఓలా, ఉబెర్‌లపై ఢిల్లీ ప్రభుత్వ కీలక నిర్ణయం

29 Nov, 2023 15:38 IST|Sakshi

న్యూఢిల్లీ: త్వరలో ఢిల్లీలో ఓలా, ఉబెర్‌ లాంటి యాప్‌ బేస్డ్‌ క్యాబ్‌ అగ్రిగేటర్‌లను ప్రభుత్వం నియంత్రించనుంది. ఇందు కోసం కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన డ్రాఫ్ట్‌ పాలసీకి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదం తెలపడంతో కొత్త పాలసీని త్వరలో నోటిఫై చేస్తామని రవాణా శాఖ మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తెలిపారు. 

కొత్త పాలసీ ప్రకారం ఓలా ఉబెర్‌ లాంటి యాప్‌ ఆధారిత క్యాబ్‌ సర్వీసు ప్రొవైడర్లు ఢిల్లీలో వాడే తమ వాహనాలను 2030లోగా ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చుకోవాల్సి ఉంటుంది. 25 కంటే ఎక్కువ వాహనాలున్న సర్వీస్‌ ప్రొవైడర్‌ కంపెనీలన్నింటికీ కొత్త పాలసీ వర్తిస్తుంది. ఈ పాలసీ కింద అగ్రిగేటర్లు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.క్యాబ్‌ ఆపరేటర్లు కస్టమర్ల వద్ద నుంచి పీక్‌ అవర్స్‌లో వసూలుచేసే అత్యధిక ఛార్జీలపై మాత్రం డ్రాఫ్ట్‌లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. 

ఈ కామర్స్‌ సేవలందించే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఫుడ్‌ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీలకు కూడా ఈ కొత్త పాలసీ వర్తించనుంది.వారు కూడా తమ వాహనాలన్నింటినీ గడువులోగా విద్యుత్‌ వాహనాలుగా మార్చుకోవాల్సి ఉంటుంది.వాహనాలన్నీ రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగానే ఢిల్లీలో తిరగాల్సి ఉంటుంది.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై లక్ష రూపాయల దాకా జరిమానాలు విధంచనున్నారు.  

ఇదీచదవండి..దివ్యాంగులకు రైల్వేశాఖ అందించే ప్రత్యేక సౌకర్యాలివే..

మరిన్ని వార్తలు