సునామీ బాధితుల కోసం ‘ఆపరేషన్‌ సముద్ర మైత్రి’

4 Oct, 2018 06:41 IST|Sakshi

న్యూఢిల్లీ: భారీ భూకంపం, సునామీ ధాటికి సర్వంకోల్పోయిన ఇండోనేసియా ప్రజల కోసం భారత్‌ ఆపన్నహస్తం అందిస్తోంది. సహాయక సామగ్రి, మందులతో నింపిన రెండు నేవీ నౌకలు, రెండు విమానాలను ఇండోనేసియాకు పంపినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. వైద్యసిబ్బందితోపాటు తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటుచేసేందుకు కావాల్సిన సామగ్రినీ తరలించారు. చెన్నై నుంచి 25 బ్యారెళ్ల కిరోసిన్‌ను విమానంలో పంపారు. 1,400 మందికిపైగా మృతిచెందిన ఇండోనేసియాలోని పలూ పట్టణంలో సహాయక చర్యలను వేగవంతం చేశారు.

మరిన్ని వార్తలు