నెంబర్‌ వన్‌ సాధించడమే లక్ష్యం: బాదల్‌

12 Jun, 2020 22:12 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనాలో కరోనా వైరస్‌ ఉద్భవించడం వల్ల ఆ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలు వెనుకంజ వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తర్వాత అతి పెద్ద జనాభా కలిగిన భారత్‌లో పెట్టుబడులకు అవకాశం ఏర్పడింది. చైనాలో నెలకొన్న ఈ సంక్షోభాన్ని భారత్‌ అవకాశంగా మార్చుకోబోతున్నట్లు కేంద్ర ఆహార శుద్ధి శాఖా మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ తెలిపారు. ఇటీవల బాదల్‌ ఓ ఇంటర్వ్యూల్లో స్పందిస్తూ.. ఆహార రంగానికి సంబంధించిన అన్ని ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాలలో భారత్‌ రెండో స్థానంలో ఉందని ఆమె గుర్తు చేశారు. భవిష్యత్తుల్లో అన్ని దేశాలకు ఎగుమతులు చేసి.. నెంబర్‌వన్‌‌ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యమని తెలిపారు.

ప్రస్తుతం కేవలం 10శాతం ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని.. కానీ మౌళిక సదుపాయాల కొరత వల్ల ఆశించిన స్థాయిలో ఎగుమతి చేయలేక పోతున్నామని అన్నారు. ఆహార ఉత్పత్తులను నిల్వ చేసే గిడ్డంగులను భారీ స్థాయిలో నిర్మించబోతున్నట్లు పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్‌ కారణంగా చైనాలో జంకుతున్న దేశాలకు భారత్‌ వరంగా మారనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. (చదవండి: టమాటా, ఉల్లి ధరలు పడిపోతే వెంటనే చర్యలు

మరిన్ని వార్తలు