పాకిస్థాన్‌కు దీటైన సమాధానం: పారికర్

17 Oct, 2016 17:52 IST|Sakshi
పాకిస్థాన్‌కు దీటైన సమాధానం: పారికర్

పాకిస్థాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నా.. వాళ్లకు భారత సైన్యం దీటైన సమాధానం ఇస్తోందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. పాకిస్థానీ సైన్యం జరిపిన కాల్పుల్లో తాజాగా ఒక జవాను మరణించిన నేపథ్యంలో ఆయనిలా చెప్పారు. గత ఐదారేళ్లుగా వందల సంఖ్యలో కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, అయితే.. ఇప్పుడు వాళ్లు ఎన్నిసర్లు వచ్చినా మళ్లీ అన్నిసార్లు మనం గట్టి జవాబు ఇస్తున్నామని ఆయన అన్నారు.

కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రాజౌరీ సెక్టార్‌లో పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాకు చెందిన సుదీష్ కుమార్ (24) అనే సిపాయి ప్రాణాలు కోల్పోయాడు. దానికి బదులుగా భారత దళాలు కూడా కాల్పులు జరిపాయని మనోహర్ పారికర్ తెలిపారు. సెప్టెంబర్ 29వ తేదీన భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి వెళ్లి మరీ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత.. ఇప్పటివరకు 25 సార్లు పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడ్డాయని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు