దేశంలో ఐఐఎస్‌సీయే టాప్

7 Sep, 2016 10:02 IST|Sakshi

లండన్: భారత్ విశ్వవిద్యాలయాల్లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే మంగళవారం విడుదలైన క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2016-17 జాబితాలో ఐఐఎస్‌సీ ర్యాంకు 152కు తగ్గింది. గత ఏడాది జాబితాలో దీనికి 147వ స్థానం లభించింది.

తాజా జాబితాలోని తొలి 400 ర్యాంకుల్లో స్థానం దక్కిన ఇతర భారత ఉన్నత విద్యా సంస్థల్లో ఢిల్లీ ఐఐటీ(185), బాంబే ఐఐటీ(219), మద్రాస్ ఐఐటీ(249), కాన్పూర్ ఐఐటీ (302), ఖరగ్‌పూర్ ఐఐటీ (313), రూర్కీ ఐఐటీ(399) ఉన్నాయి. ఈ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ (2), హార్వర్డ్ యూనివర్సిటీ(3), యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్(4) తదితరాలున్నాయి.
 

>
మరిన్ని వార్తలు