రైళ్లలో ఐడీ ప్రూఫ్‌గా ఎం ఆధార్‌

13 Sep, 2017 19:24 IST|Sakshi
రైళ్లలో ఐడీ ప్రూఫ్‌గా ఎం ఆధార్‌
సాక్షి,న్యూఢిల్లీః రైళ్లలో ఏ రిజర్వ్‌డ్‌ క్లాస్‌లో ప్రయాణించే వారికైనా ఆధార్‌ కార్డ్‌ డిజిటల్‌ వెర్షన్‌ ఎం ఆధార్‌ను గుర్తింపు కార్డుగా అనుమతించాలని రైల్వే మంత్రిత్వ శాఖ బుధవారం నిర్ణయించింది. యూఐఏఐ ప్రారంభించిన ఎం ఆధార్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఎవరైనా తమ ఆధార్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
 
అయితే ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్‌ నెంబర్‌కే కార్డును డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. రైళ్లలో అధికారులకు ఆధార్‌ చూపించాల్సి వస్తే సదరు యాప్‌ను ఓపెన్‌ చేసి తమ పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేస్తే ఎం ఆధార్‌ కనిపిస్తుంది. ఐడీ ఫ్రూప్‌గా దీన్ని చూపిస్తే రైల్వే అధికారులు ప్రయాణీకులను జర్నీకి అనుమతిస్తారని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
మరిన్ని వార్తలు