‘ఆ పాపాలకు మూల్యం చెల్లిస్తారు’

17 Dec, 2018 14:32 IST|Sakshi
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్‌ నేత సజ్జన్‌ కుమార్‌ను ఢిల్లీ హైకోర్టు దోషిగా నిర్ధారిస్తూ దిగువ కోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చడంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. సజ్జన్‌ కుమార్‌ను దోషిగా హైకోర్టు తేల్చడం న్యాయం గెలిచితీరుతుందని కాస్త ఆలస్యమైనా వెల్లడైందన్నారు.

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల పాపాలకు కాంగ్రెస్‌ పార్టీతో పాటు గాంధీ కుటుంబం మూల్యం చెల్లించకతప్పదని వ్యాఖ్యానించారు. 1984 ఘర్షణల బాధితులకు కాంగ్రెస్‌ ఎలాంటి న్యాయం‍ చేయలేదని, బాధితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం విశ్వసనీయతను పాదుకొల్పిందన్నారు.

సిక్కు వ్యతిరేక ఊచకోత ఘటనల్లో అల్లర్లను ప్రేరేపించేలా సజ్జన్‌ కుమార్‌ ప్రసంగించారని, మత సామరస్యానికి విఘాతం కల్పించారని ఢిల్లీ హైకోర్టు ఆయనను దోషిగా పేర్కొంటూ జీవిత ఖైదును విధించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు