‘విమర్శిస్తే అణిచివేత తగదు’

18 May, 2020 18:56 IST|Sakshi

విపక్షంపై బీజేపీ ఫైర్‌

సాక్షి, న్యూఢిల్లీ : విపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రజల అసమ్మతిని అణిచివేసేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా విపక్షంపై విరుచుకుపడ్డారు. గత కొద్దిరోజులుగా విపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ యంత్రాంగం సోషల్‌ మీడియాలో బీజేపీ కార్యకర్తలు, విమర్శకుల గొంతను బలవంతంగా అణిచివేస్తోందని నడ్డా దుయ్యబట్టారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తమ వైఫల్యాల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే రాజకీయంగా బదులిచ్చేందుకు సిద్ధపడాలని, అణిచివేయాలని ప్రయత్నించడం సరికాదని హితవు పలికారు.

చర్చ, విమర్శ మన ప్రజాస్వామిక ప్రక్రియలో అంతర్భాగమని, అధికారంలో ఉన్న వారు తమ అధికార బలంతో విమర్శకులను అణిచివేయడం తగదని నడ్డా ట్వీట్‌ చేశారు.  కాగా కరోనా పరిణామాలపై అవాస్తవ ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయని వార్తలు రాగా, ప్రభుత్వ వ్యతిరేక వార్తలపై గుజరాత్‌ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో  క్రిమినల్‌ కేసులు పెడుతున్నారని విపక్షాలు ఆరోపించాయి. 

చదవండి : విజయ్‌ సేతుపతిపై బీజేపీ నేతల ఫిర్యాదు

మరిన్ని వార్తలు