సీబీఐ కస్టడీకి కంప్లి ఎమ్మెల్యే

21 Sep, 2013 02:19 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ఉత్తర కన్నడ జిల్లా బెలెకెరె ఓడ రేవు నుంచి ఇనుప ఖనిజాన్ని అక్రమంగా ఎగుమతి చేశారన్న కేసులో కంప్లి ఎమ్మెల్యే సురేశ్ బాబుకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 27 వరకు సీబీఐ కస్టడీకి ఆదేశించింది. ఆయనను సీబీఐ శుక్రవారం భారీ బందోబస్తు మధ్య సిటీ సివిల్ కోర్టు సముదాయంలోని ప్రత్యేక కోర్టులో హాజరు పరిచింది. సురేశ్‌ను 15 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయాధికారి సోమరాజును సీబీఐ అధికారులు కోరారు. అయితే సురేశ్ న్యాయవాది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాత సాక్ష్యాధారాలతో సురేశ్‌ను అరెస్టు చేశారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ అభ్యర్థనను న్యాయాధికారి తిరస్కరించారు.

>
మరిన్ని వార్తలు