కుమారస్వామి సంచలన నిర్ణయం

3 Jun, 2018 15:07 IST|Sakshi
కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి (ఫైల్‌ఫోటో)

సాక్షి, బెంగళూర్‌ : దుబారా వ్యయాన్ని తగ్గించుకోవాలని కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే క్రమంలో కొత్తగా కార్ల కొనుగోలును, నూతన వాహనాల అలవెన్సులకు పంపిన ప్రతిపాదనలను పునఃసమీక్షించాలని ఈ మేరకు ఆయన ఓ అధికారిక ప్రకటనలో కోరారు. కార్యాలయాల పునరుద్ధరణను కూడా అవసరరమైతే వాయిదా వేయాలని కూడా కుమారస్వామి అధికార యంత్రాంగానికి సూచించారు.

కీలక సమావేశాల్లో ప్రభుత్వ అధికారులు మొబైల్‌ ఫోన్ల వాడకానికి దూరంగా ఉండాలని కోరారు. సమావేశాల్లో మొబైల్‌ ఫోన్లు వాడరాదని అధికారులను కోరుతూ ఈనెల ఒకటిన సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.శాఖల కేటాయింపుపై జేడీఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య అవగాహన కుదిరిన అనంతరం కుమారస్వామి ఈ చర్యలు చేపట్టారు.

ఇరు పార్టీల మధ్య కుదిరిన అవగాహన ప్రకారం జేడీఎస్‌ ఆర్థిక శాఖను, కాంగ్రెస్‌ హోంమంత్రిత్వ శాఖను చేపడుతుంది. జూన్‌ 6న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం కుమారస్వామి వెల్లడించిన విషయం తెలిసిందే. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా