ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండండి

25 Apr, 2015 14:51 IST|Sakshi

న్యూఢిల్లీ:   దేశవ్యాప్తంగా భయోత్పాతం సృష్టించిన  భూకంపం పై  వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర హోం మంత్రి ట్వీట్స్ చేశారు.  హోంమంత్రి  రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ విపత్తు నివారణ సంస్థలను అప్రమత్తం చేసినట్టు తెలిపారు.  నష్ఠం జరిగినట్టుగా ఇంతవరకు ఎలాంటి ప్రాథమిక రిపోర్టు అందలేదని  ఆయన పేర్కొన్నారు.


కేజ్రీవాల్
ఢిల్లీలో అలజడి రేపిన భూకంపంపై ప్రశాంతంగా ఉండాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.   అధికారులు రంగంలోకి దిగారు. పరిస్థితిని అంచనా వేస్తున్నారంటూ ట్వీట్ చేశారు.
 

మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ  రాష్ట్రంలో నెలకొన్న భూకంపం పరిస్థితిపై స్పందించారు.  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఉండాలని  విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని  జాగ్రత్తగా గమనిస్తున్నామని ఆమె తెలిపారు.  ముఖ్యంగా డార్జిలింగ్, సిలిగురి తదితర ఏరియాల్లోని  సీనియర్ అధికారులతో చర్చించినట్లు ఆమె తెలిపారు.

>
మరిన్ని వార్తలు