పోలీసుల అదుపులో ఢిల్లీ డిప్యూటీ సీఎం

12 Dec, 2016 14:52 IST|Sakshi
పోలీసుల అదుపులో ఢిల్లీ డిప్యూటీ సీఎం
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, ఆయన కేబినెట్ మంత్రి కపిల్ మిశ్రాలను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వైపుగా ర్యాలీతో వెళుతున్న వారిని మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు.

వెనుదిరిగి వెళ్లాలనని చెప్పినా వినకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతోపాటు పార్లమెంటువైపుగా దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో వారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గతవారం కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ వీధుల్లో పెద్ద నోట్ల రద్దు నిరసిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ ఏదో ఒక రూపంలో ప్రతిరోజు  తన ఆందోళన ఇప్పటికే తెలియజేస్తున్న విషయం తెలిసిందే. మరో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా తాజాగా తీసిన ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో ఉన్నప్పటికీ ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోలేదు.
మరిన్ని వార్తలు