పోలీసులు వలసకార్మికుల మధ్య మరోసారి ఘర్షణ

9 May, 2020 15:24 IST|Sakshi

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌జిల్లా మోర గ్రామంలో శనివారం మరోసారి వలసకార్మికులు పోలీసులకు మధ్య ఘర్షణ ఏర్పడింది. తమను ఇళ్లకు పంపించాలంటూ కార్మికులకు రోడ్డుపైకి వచ్చి నిరసనకు దిగారు. పోలీసు వాహనాల మీద రాళ్లతో దాడి చేశారు. ఈ విషయం పై అధికారులు మాట్లాడుతూ వలస కార్మికులను వారివారి ఇళ్లకు పంపించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. (అహ్మదాబాద్లో పోలీసులపై రాళ్ల దాడి)

వలస కార్మికుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఒడిషా, నుంచి వచ్చారు. వీరందరూ హజీర్‌ పారిశ్రామిక వాడలో పనిచేస్తూ మోర గ్రామంలో నివసిస్తూ ఉంటారు. ఈ ఘటనతో పోలీసులు  ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకొని అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో పాటు పోలీసులపై దాడి చేసినందుకు గాను 50 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఆ ప్రాంతమంతా స్టేట్‌ రిజర్వ్‌ పోలీసులు మోహరించారు. 

(లాక్డౌన్: ఇళ్లకు వెళతాం.. వదిలేయండి!)

మరిన్ని వార్తలు