జమ్మూకశ్మీర్‌లో కొలువుదీరిన సంకీర్ణ ప్రభుత్వం

1 Mar, 2015 12:19 IST|Sakshi
జమ్మూకశ్మీర్‌లో కొలువుదీరిన సంకీర్ణ ప్రభుత్వం

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో పీడీపీ- బీజీపీ  సంకీర్ణ  ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా పీడీపీ నేత ముఫ్తీ మహ్మద్ సయీద్  ప్రమాణ స్వీకారం చేశారు.  బీజేపీ కి చెందిన నిర్మల సింగ్ డిప్యూటీ సీఎంగా డోంగ్రీ భాషలో ప్రమాణం చేశారు. నగరంలోని జమ్మూ యూనివర్సిటీలోని జనరల్ జోరావర్ సింగ్ ఆడిటోరియంలో జరిగిన  కార్యక్రమంలో వీరి చేత గవర్నరు ఎన్‌ఎన్ వోరా ప్రమా ణం  చేయించారు.


మంత్రులుగా  అబ్దుల్ రెహమాన్ భట్, వీర్, చంద్ర ప్రకాశ్, జావేద్ ముప్తఫా మీర్, అబ్దుల్ హక్ ఖాన్, బాలి భగత్ , లాల్ సింగ్ తదితరులు ప్రమాణం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పీడీపీ నేత మహమూద్ ముఫ్తీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మరిన్ని వార్తలు