రోజుకు 16గంటలు ఒంటికాలిపై నిల్చొబెట్టి..

12 Jun, 2016 11:00 IST|Sakshi
రోజుకు 16గంటలు ఒంటికాలిపై నిల్చొబెట్టి..

ముంబయి: బలవంతంగా కొందరు చిన్నారులను ఎత్తుకెళ్లి వారితో కఠిన పద్ధతిలో మంత్రాలు జపించేలా చేసిన ఇద్దరు స్వామిజీలను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఆ పిల్లలకు విముక్తి కలిగించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి 28మంది చిన్నారులను మాయమాటలు చెప్పి ముంబయికి ఎత్తుకొచ్చారు.

అనంతరం వారిని ఖాండ్విలిలోని సమతానగర్ ఏరియా భవనంలోకి తరలించారు. అక్కడ నుంచి ఠాకూర్ గ్రామంలోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడ బలవంతంగా వారితో మంత్రాలు నేర్పించే పనికి ఉపక్రమించారు. ఈ క్రమంలో వారిని రోజుకు 16 నుంచి 17గంటలు ఒంటికాలిపై నిల్చోబెట్టి శ్లోకాలు, మంత్రాలు నేర్పడం మొదలుపెట్టారు. మంత్రాలు సరిగా చెప్పని వారిని చావగొట్టడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఎట్టకేలకు ఆ దొంగ స్వాములను అరెస్టు చేసి పిల్లలకు విముక్తి కలిగించారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు