-

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

20 Sep, 2016 15:44 IST|Sakshi

కొల్లమ్ః ఫెట్రిలైజర్స్ తో వెడుతున్న గూడ్స్ రైలు కొల్లం ప్రాంతంలో పట్టాలు తప్పడంతో ఆ దారిలో ప్రయాణించే రైళ్ళకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గూడ్స్ ప్రమాదంతో తిరువనంతపురం, ఎర్నాకుళం మధ్య భారీగా రైల్వే ట్రాఫిక్ నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. సస్థంకొట్టా దగ్గరలోని కరునగపల్లి ప్రాంతంలో పట్టాలు విరిగి, ఎలక్ట్రిక్ లైన్స్ దెబ్బతినడంతో సోమవారం అర్థరాత్రి  గూడ్స్ ట్రైన్ లోని తొమ్మిది బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు.

మధురై నుంచి కొట్టాయం వెడుతున్న గూడ్స్ రైలు ప్రమాదంతో.. కొల్లం, కయాంకులమ్ స్టేషన్ల మధ్య తొమ్మిది పాసింజర్ రైళ్ళతోపాటు నాలుగు ఇతర రైళ్ళను రద్దు చేసి, సింగిల్ లైన్ లో ట్రాఫిక్ ను మళ్ళించినట్లు అధికారులు పేర్కొన్నారు. ట్రాక్ లను పునరుద్ధరించి, ట్రాఫిక్ సమస్యను సాయంత్రానికి పరిష్కరించడంతోపాటు రద్దు చేసిన రైళ్ళను యధాతథంగా నడుపుతామని తెలిపారు. ఆగస్టు 28 న కొచ్చికి దగ్గరలోని కారుకుట్టి సమీపంలో మంగుళూరు ఎక్స్ ప్రెస్ రైలు 12 బోగీలు పట్టాలు తప్పిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు