పీఎంసీ కుంభకోణం: ఆర్థిక మంత్రి నిర్మల హామీ

10 Oct, 2019 20:45 IST|Sakshi

సాక్షి, ముంబై: పంజాబ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంక్‌ (పీఎంసీ) కుంభకోణంపై ఆందోళన చేస్తున్న ఖాతాదారులకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా ఇచ్చారు. మరోసారి ఆర్‌బీఐ గవర్నర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. నగదు విత్‌డ్రాయల్స్‌పై ఉన్న పరిమితలను సవరించమని కోరతానన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ముంబైలోని బీజేపీ ఆఫీస్‌లో నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశానికి రాగా.. అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకున్న బ్యాంక్ కస్టమర్లు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో వారిని కలిసి మాట్లాడారు సీతారామన్‌. తాను మరోసారి ఆర్‌బీఐ గవర్నర్‌తో మాట్లాడతానని తెలిపారు. అలాగే ఆర్థికశాఖ కార్యదర్శులను కూడా అసలు ఏం జరిగిందనే అంశంపై పరిశీలించాలని ఆదేశించానని చెప్పారు. పీఎంసీ కుంభకోణం నేపథ్యంలో ఆర్‌బీఐ ఆ బ్యాంక్‌ నుంచి నగదు ఉపసంహరణను రూ. 25వేలకే పరిమితం చేసింది.

మరిన్ని వార్తలు