చైనాకు భారత్‌ మరో షాక్‌

1 Jul, 2020 16:09 IST|Sakshi

న్యూఢిల్లీ : చైనాకు భారత్‌ ప్రభత్వం మరో​షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే 59 చైనీస్‌ యాప్‌లపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం.. తాజాగా హైవే ప్రాజెక్టులో చైనా సంస్థలపై నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. హైవే ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలకు అనుమతి నిరాకరిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం తెలిపారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, వివిధ రంగాల్లో చైనా పెట్టుబడిదారులను ప్రభుత్వం ప్రొత్సహించదని చెప్పారు.

త్వరలోనే హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనే చైనా సంస్థలపై నిషేధం విధించేలా ఓ విధానాన్ని తీసుకురాబోతున్నట్టు చెప్పారు. ఆ విధానంలో హైవే ప్రాజెక్టులో పాల్గొనేలా భారత కంపెనీల అర్హత ప్రమాణాలు పెంపొందించేలా నిబంధనల సడలింపు కూడా చేపడతామని వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

మరిన్ని వార్తలు