'ఓం' అంటే తప్పేంటి?

23 May, 2016 10:19 IST|Sakshi
'ఓం' అంటే తప్పేంటి?

న్యూఢిల్లీ: యోగాను వ్యతిరేకించడం సరికాదని ఉపరాష్ట్రపతి సతీమణి సల్మా అన్సారీ అన్నారు. యోగా చేయడం ఆరోగ్యానికి మంచిదేనని అభిప్రాయపడ్డారు. యోగాతో ఎముకల సమస్య నుంచి తాను ఉపశమనం పొందానని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున 'ఓం' ఉచ్ఛరించడంతో తప్పేంలేదని పేర్కొన్నారు. మత సంబంధమైన పదాలు పలకడం లేదు కదా అని అన్నారు. అందరూ తప్పనిసరిగా యోగా చేయాలని ఆమె సూచించారు.

యోగా దినోత్సవం (జూన్ 21) నాడు యోగా చేసే వారంతా 'ఓం' ఉచ్ఛరించాలని ఇటీవల ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచన చేసింది. దీనిపై మైనారిటీ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది.

మరిన్ని వార్తలు