లోక్ సభ సమావేశాలు రేపటికి వాయిదా

16 Nov, 2016 11:23 IST|Sakshi

న్యూఢిల్లీ: లోక్ సభ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డారు. తొలిరోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇటీవల మృతి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఎంపీ రేణుక సిన్హా మృతికి సభ సంతాపం తెలిపిన వెంటనే సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. మరోవైపు రాజ్యసభలోనూ థాయ్లాండ్ రాజు మృతికి సంతాపం తెలిపింది.

రాజ్యసభలో పెద్దనోట్లపై నిరసన
అనంతరం నోట్ల రద్దును నిరసిస్తూ రాజ్యసభ సభ్యులు నిరసనకు దిగారు. ఈ అంశంపై చర్చ జరగాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ఈ అంశంపై అజెండా ప్రకారమే చర్చకు అనుమతి ఇస్తామని డిప్యూటీ స్పీకర్ కురియన్ స్పష్టం చేశారు.

నోట్ల రద్దుపై చర్చ సందర్భంగా  కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ మాట్లాడుతూ నల్లధనం పేరుతో దేశంలో అలజడి సృష్టించారన్నారు. నల్లధనం వెలికి తీయడానికి తాము వ్యతిరేకం కాదని తెలిపారు. ఒక్కమాటతో 86 శాతం కరెన్సీ పనికిరాకుండా పోయిందని ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు