546 మంది భారత ఖైదీలకు విముక్తి!

1 Jul, 2017 16:32 IST|Sakshi
546 మంది భారత ఖైదీలకు విముక్తి!

న్యూఢిల్లీ: పాకిస్తాన్ జైళ్లల్లో మగ్గుతున్న 546 మంది భారతీయులకు త్వరలో విముక్తి లభించనుంది. పాక్ లో ఎన్నో ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న వీరిని భారత్‌కు పంపివేసినట్లు పాక్ ప్రభుత్వం శనివారం ఓ జాబితా విడుదల చేసింది. 2008 మే21న చేసుకున్న ఒప్పందం ప్రకారం తమ దేశంలో శిక్ష అనుభవిస్తున్న భారతీయులను విడుదల చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం హైకమిషనర్ గౌతమ్ బాంబవాలేకు ఖైదీల జాబితా అందజేసింది.

విడుదలకానున్న 546 మంది భారతీయులలో 52 మంది సామాన్య ప్రజానికం ఉండగా, 494 మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. ప్రతి ఏడాది జనవరి 1న, జులై 1న ఇలా రెండు పర్యాయాలు పరస్పరం ఖైదీలను వారి దేశాలకు పంపివేసేందుకు గాను వారి జాబితా విడుదల చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. భారత్ విడుదల చేయనున్న తమ దేశ ఖైదీల జాబితా కోసం ఎదురుచూస్తున్నట్లు ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ చెప్పారు.

మరిన్ని వార్తలు