పాక్‌లో అంగతకుల కాల్పులు.. లష్కరే తోయిబా మాజీ కమాండర్‌ మృతి

10 Nov, 2023 10:29 IST|Sakshi

ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) మాజీ కమాండర్‌ అక్రమ్‌ ఖాన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్థాన్‌లో కాల్చి చంపారు. అక్రమ్‌ ఖాన్‌ అలియాస్‌ అక్రమ్‌ గాజీ..  ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బజౌర్‌ జిల్లాలో గురువారం అంగతకుల కాల్పుల్లో మరణించారు. 

కాగా అక్రమ్‌ ఖాన్‌ 2018 నుంచి 2020 వరకు ఎల్‌ఈటీ రిక్రూట్‌మెంట్ సెల్‌కు నాయకత్వం వహించారు. పాక్‌లో భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా అతడు పేరుగాంచారు. అక్రమ్‌ చాలా కాలంపాటు తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. అతను ర్రికూట్‌మెంట్‌ సెల్‌ అధిపతిగా ఉన్న సమయంలో సానుభూతిగల వ్యక్తులను గుర్తించి వారిని ఉగ్రవాద సంస్థలో చేర్చుకోవడంలో కీలకపాత్ర వహించారు.

ఇదిలా ఉండగా గత నెల అక్టోబర్‌లో పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహ్మద్‌ టాప్‌ కమాండర్‌  షాహిద్ లతీఫ్‌ పాకిస్థాన్‌లో హత్యకు గురైన విషయం విదితమే. పంజాబ్‌లోని సియాల్‌ కోట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను కాల్చి చంపారు. గుజ్రాన్‌వాలా నగరానికి చెందిన లతీఫ్‌.. భారతదేశ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరు. 2016 జనవరి 2న జరిగిన పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై  జరిగిన ఉగ్రదాడికి మాస్టర్‌మైండ్‌ లతీఫే.
చదవండి: Israel-Hamas conflict: గాజా సిటీపై దండయాత్ర

మరిన్ని వార్తలు