భారత్పై 685సార్లు కాల్పులు జరిపిన పాక్

25 Feb, 2015 08:41 IST|Sakshi

భారత్పై పాకిస్థాన్ 685సార్లు కయ్యానికి కాలు దువ్వి కాల్పులు జరిపినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత జూన్ 2014 నుంచి జనవరి 2015 మధ్య ఎనిమిది నెలల కాలంలో భారత సరిహద్దు ప్రాంతాలపై, మిలటరీ క్యాంపులపై పాక్ ఈ  కాల్పులు జరిగినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో దాదాపు 16 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా ఎనిమిదిమంది సైనికాధికారులు చనిపోయారు.

 

రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో కొందరు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ లిఖిత పూర్వక బదులిచ్చారు. ఇందులో ఆర్మీ ఆదీనంలో ఉన్న నియంత్రణ రేఖ వద్ద 126సార్లు పాకిస్థాన్ కాల్పులు జరపగా.. సరిహద్దు రక్షణ దళం (బీఎస్ఎఫ్) పరిధిలో ఉన్న సరిహద్దు భాగంలో 559 సార్లు పాక్ తెగబడింది.   

>
మరిన్ని వార్తలు