డైలమాలో భారత్-పాక్ చర్చలు

4 Jan, 2016 09:51 IST|Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్థాన్తో భరత్ చర్చల కార్యక్రమం ముందుకెళ్లడం అనుమానంగానే మారింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం భారత్- పాక్ విదేశీ కార్యదర్శుల స్థాయి సమావేశం జనవరి 14,15 తేదీలలో జరగాల్సి ఉంది. అయితే పఠాన్కోట్లో దాడి జరిపిన ఉగ్రవాదుల మూలాలు పాక్లోనే ఉన్నాయని ఇప్పటికే భారత నిఘావర్గాలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో చర్చలు డైలమాలో పడ్డాయి.

పాక్ అధికార వర్గాలు ఉగ్రవాదంపై స్పష్టమైన వైఖరి పాటించకుండా ఓ వైపు చర్చలు అంటూ స్నేహహస్తం అందిస్తూనే.. మరో వైపు ఉగ్రమూకలకు సహకరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్తో చర్చలు సజావుగా సాగడం సందేహమే అని భారత అధికార వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని వార్తలు