ఈ నెలలో రెండవసారి తగ్గిన పెట్రోల్ ధర

30 Aug, 2014 19:50 IST|Sakshi
ఈ నెలలో రెండవసారి తగ్గిన పెట్రోల్ ధర

హైదరాబాద్: వాహనదారులకు శుభవార్త. పెట్రోల్ ధర మళ్లీ తగ్గింది. లీటరుకు ఒక రూపాయి 82 పైసలు తగ్గించారు.  తగ్గిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయి. హైదరాబాద్లో లీటర్కు రెండు రూపాయల 50 పైసల వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ నెలలో పెట్రోల్ ధర తగ్గడం ఇది రెండవసారి.

స్వాత్రంత్ర దినోత్సవ కానుకగా ఈ నెల 15న  పెట్రోల్ ధర తగ్గించారు. అప్పుడు లీటర్‌కు రూ.1.89 పైసల నుంచి రూ.2.38(ఢిల్లీలో ధరలు) వరకు తగ్గించారు.

మరిన్ని వార్తలు