పీఐబీ చీఫ్‌కు కరోనా పాజిటివ్‌..

8 Jun, 2020 11:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌ కేఎస్‌ ధత్వాలియాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. పీఐబీకి నాయకత్వం వహించే ధత్వాలియా కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రధాన ప్రతినిధి. కరోనా పాజిటివ్‌ రావడంతో చికిత్స నిమిత్తం ఆయనను ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో గత రాత్రి 7 గంటల సమయంలో చేర్చించారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: కేంద్రం జోక్యాన్ని కోరిన మాయావతి 

ధత్‌వాలియాకు కరోనా సోకడంతో జాతీయ మీడియా కేంద్రాన్ని సోమవారం రోజున మూసి, శానిటైజ్‌ చేయనున్నట్లు పీఐబీ అధికారులు వెల్లడించారు. అయితే ధత్‌వాలియా ఈ మధ్య జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నరేంద్ర సింగ్‌ తోమర్‌, ప్రకాష్‌ జవదేకర్‌లతో కలిసి సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో అతని ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించడంపై అధికారులు దృష్టి సారించారు. చదవండి: కేన్సర్‌తో ఆస్పత్రి‌లో చేరి.. కరోనాతో..! 

మరిన్ని వార్తలు