‘ఆయుష్మాన్‌ భారత్‌’పై మోదీ సమీక్ష

5 Aug, 2018 05:41 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన జాతీయ ఆరోగ్య సురక్ష పథకం ‘ఆయుష్మాన్‌ భారత్‌’పై శనివారం ప్రధాని మోదీ సమీక్ష జరిపారు. దేశవ్యాప్తంగా ప్రారంభించనున్న ఈ కార్యక్రమం ఏర్పాట్ల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, ప్రధాని కార్యాలయం అధికారులు పాల్గొన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ అమలుకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో సాగుతున్న ఏర్పాట్లు, సాంకేతిక వనరుల అందుబాటు తదితర వివరాలను ప్రధానికి అధికారులు వివరించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పది కోట్ల నిరుపేద కుటుంబాలకు చెందిన దాదాపు 50 కోట్ల మందికి ఆరోగ్య భరోసా లభించనుంది. 

మరిన్ని వార్తలు