ప్రధాని మోదీ ఇప్పటికీ టాపరే!

7 Apr, 2016 14:06 IST|Sakshi
ప్రధాని మోదీ ఇప్పటికీ టాపరే!

న్యూఢిల్లీ:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య తరగతి ప్రజల దృష్టిలో నేటికీ టాపర్ అంటున్నాయి తాజా సర్వేలు. భారత్ లోని ప్రధాన ఏడు నగరాల్లో జరిపిన సర్వేలలో మోదీనే ప్రథమ స్థానంలో ఉన్నట్లు ఈటీ-టీఎన్ఎస్ సర్వేలో  వెల్లడి అయ్యాయి.

నరేంద్రమోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓ బలమైన మెజారిటీ తో అధికారాన్ని కైవసం చేసుకొని దాదాపు రెండు సంవత్సరాలు గడిచింది. అయిప్పటికీ మోదీనే అధిక మద్దతు కలిగి ఉన్నట్లు ఈటీ-టీఎన్ఎస్ సర్వే లెక్కలు నిరూపిస్తున్నాయి. ఆయన అజెండాలో కీలక అంశాల సంస్కరణలో వైఫల్యం చెందడంతోపాటు, అనేక వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం రేటింగ్స్ లో ఫస్ట్ మార్కును మాత్రం కోల్పోలేదని తాజా సర్వేలు తేల్చి చెప్పాయి.

ఆర్థిక పనితీరులో 86 శాతం, ఉద్యోగ సృష్టిలో 62 శాతం,  భవిష్యత్ ప్రణాళికల విషయంలో 58 శాతం మోదీ ప్రభుత్వం మార్కులు కొట్టేసిందని సర్వే లెక్కలు చెప్తున్నాయి. అచ్చేదిన్ ఆనేవాలా హై అంటూ నమ్మకంగా చెప్పే మోదీ ప్రజల్లో నేటికీ మొదటి స్థానంలోనే ఉన్నారని ఈటీ-టీఎన్ఎస్ సర్వే చెప్తోంది.

మరిన్ని వార్తలు