2022 నాటికి ‘పోలవరం హైడ్రో’ ప్రాజెక్ట్‌ పూర్తి

31 Mar, 2017 01:42 IST|Sakshi
2022 నాటికి ‘పోలవరం హైడ్రో’ ప్రాజెక్ట్‌ పూర్తి

వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి ప్రశ్నకు కేంద్రం జవాబు

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో నిర్మాణంలో ఉన్న 960 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పోలవరం(ఇందిర సాగర్‌) హెడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్టు 2021–22 నాటికి పూర్తి కావచ్చని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

కొవ్వాడలో 6 వేల మెగావాట్ల న్యూక్లియర్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సూత్రప్రాయంగా అనుమతులిచ్చామన్నారు.దుమ్ముగూడెం హైడ్రో  ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర విద్యుత్‌ అథారిటీ తిప్పిపంపినట్టు మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు