పొలాల వెంట మోగుతోన్న పోలీస్ సైరన్లు

28 May, 2020 16:15 IST|Sakshi

భోపాల్ : క‌రోనాతో వ‌ణికిపోతున్న భార‌త్‌కు రాకాసి మిడ‌త‌ల దండు కొత్త త‌ల‌నొప్పిగా మారింది. తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి గుంపులు గుంపులుగా ఖండాలు దాటి వ‌స్తూ పంట‌ల‌ను స్వాహా చేస్తున్నాయి. మ‌న దేశంలోకి ప్ర‌వేశించిన ఈ దండు ఇప్ప‌టికే రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, పంజాబ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర ప్ర‌దేశ్‌ల‌లో పంట‌ను న‌మిలేస్తూ అటు రైతులకు, ఇటు ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటిని పార‌దోలేందుకు డీజేలు పెడుతూ పెద్ద శ‌బ్ధాలు చేస్తూ పంట‌ను కాపాకునేందుకు రైతులు విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్లోని పన్నా టైగ‌ర్ రిజ‌ర్వ్ ప్రాంతంలో చెట్లు, పంట‌ల‌ను దాడి చేస్తున్న దండును పారదోలేందుకు పోలీస్ జీపుల సైర‌న్‌ల‌ను ఉప‌యోగించారు. (రాష్ట్రంపైకి మిడతల దండు?)

పొలాల వెంబ‌డి పోలీస్ జీపుల‌ను న‌డుపుతూ పెద్ద శ‌బ్ధంలో సైర‌న్‌ల‌ను మోగిస్తూ వాటిని నియంత్రించేందుకు కృషి చేస్తున్నారు ఈ విష‌యం గురించి ప‌న్నాకు చెందిన వ్య‌వ‌సాయ అధికారి సుమ‌న్ మాట్లాడుతూ.. "మిడ‌త‌ల దండు నుంచి పంట‌ల‌ను కాపాడేందుకు ఇది ఎంత‌గానో ఉప‌క‌రిస్తుంది. భారీ శ‌బ్ధాలు లేదా క్రిమిసంహార‌క మందులు పిచికారీ చేయ‌డం ద్వారా రాకాసి దండు బారి నుంచి పంట‌ను కాపాడుకోవ‌చ్చ‌"ని స‌ల‌హా ఇచ్చారు. కాగా భార‌త్‌లో మిడ‌త‌ల దండు ప్ర‌వేశించిన రాష్ట్రాల్లో నివార‌ణా చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ వెల్ల‌డించింది. (వణికిస్తున్న రాకాసి మిడతలు: రైతులు గజగజ)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా