హిమాలయాలు క్యాన్సిల్‌.. ప్రచారం షురూ: ఉమాభారతి యూటర్న్‌!

8 Nov, 2023 10:54 IST|Sakshi

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి తన హిమాలయాల పర్యటనను రద్దు చేసుకుని, రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. నవంబర్ 9 నుంచి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆమె సిల్వానీలోని బమ్‌హోరీ, సాగర్‌లోని సుర్ఖీలో ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. 

అయితే దీనికి ముందు ఉమాభారతి ఎన్నికల ప్రచారాన్ని నిరాకరించి, తాను హిమాలయాలకు వెళుతున్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఆమె పేరు నమోదు కాలేదు. అయితే ఆ తరువాత ఆమె మనసు మార్చుకుని, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అభ్యర్థన మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. 

కొద్దిరోజుల క్రితం ఉమాభారతి లలిత్‌పూర్ రైల్వే స్టేషన్‌లో స్వల్పంగా గాయపడ్డారు. ఆమె ఎడమ కాలికి గాయం అయ్యింది. తరువాత ఆమె ఝాన్సీలో ఫిజియోథెరపీ చేయించుకున్నారు. తరువాత వైద్యుల సూచన మేరకు భోపాల్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా ఆమె వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. తాను 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదని, రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నానని  ఇటీవల స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు

మరిన్ని వార్తలు