‘ఆ పోస్టర్లు మా పని కాదు’

3 Feb, 2019 20:35 IST|Sakshi

పట్నా : కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ర్యాలీకి ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీని మహిషాసురుడిగా, రాహుల్‌ను శివుడిగా వర్ణిస్తూ వెలిసిన పోస్టర్లపై కాంగ్రెస్‌ పార్టీ ప్రతిస్పందించింది. ఈ పోస్టర్లను కాంగ్రెస్‌ మద్దతుదారులే ఏర్పాటు చేశారని బీజేపీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. రాహుల్‌ను రాముడిగా, ప్రియాంక గాంధీని దుర్గామాతగా అభివర్ణించే మరికొన్ని పోస్టర్లనూ ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లపై స్ధానిక నివాసి ఫిర్యాదు మేరకు సివిల్‌ కోర్టులో కేసు నమోదు చేశారు.

రాహుల్‌,  బిహార్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మదన్‌ మోహన్‌ ఝాపై హిందువుల మనోభావాలను గాయపరిచారంటూ ఫిర్యాదు చేశారు. కాగా బీజేపీ నేతల ఆరోపణలను కాంగ్రెస్‌ తోసిపుచ్చింది. ఈ పోస్టర్లను కాంగ్రెస్‌ ఏర్పాటు చేయలేదని, ఎవరో రూపొందించిన పోస్టర్లపై తమను నిందించడం తగదని మదన్‌ మోహన్‌ ఝా వివరణ ఇచ్చారు. పార్టీ నేతలెవరైనా ఈ పోస్టర్ల ఏర్పాటు వెనుక ఉన్నట్టు తమ విచారణలో వెల్లడైతే వారిపై కఠిన చర్యలు చేపడతామని పార్టీ ఎమ్మెల్సీ ప్రేమ్‌ చంద్ర మిశ్రా వెల్లడించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా