మతం పేరుతో భయపెడుతున్నారు: ప్రకాశ్‌రాజ్‌

4 Nov, 2017 04:13 IST|Sakshi

చెన్నై: మతం, సంస్కృతి, నైతికత పేరుతో కొందరు ప్రజలను భయపెడుతున్నారంటూ నటుడు ప్రకాశ్‌రాజ్‌ శుక్రవారం ఆరోపించారు. ‘నైతికత పేరుతో నా దేశపు వీధుల్లో యువ జంటలపై దాడులు చేయడం భయపెట్టడం కాకపోతే మరేమిటి? గోవధ చేశారేమోనన్న చిన్న అనుమానంతో మనుషులపై సామూహిక దాడులు చేసి హతమార్చడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం భయపెట్టడం కాక మరేంటి? అసమ్మతితో చిన్న స్వరం వినిపించినా వారిని బెదిరించడం, దూషించడం అంటే భయపెట్టడం కాదా?’ అని ట్వీట్లు చేశారు.  

మరిన్ని వార్తలు