రైల్వే భద్రతకు ‘కోరాస్‌’

15 Aug, 2019 03:20 IST|Sakshi
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో బుధవారం తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్న కమాండోలు

న్యూఢిల్లీ: రైళ్ల భద్రత కోసం ఇకపై కమాండోలు రంగంలోకి దిగనున్నారు. కమాండోస్‌ ఫర్‌ రైల్వే సేఫ్టీ (కోరాస్‌) యూనిట్‌ను రైల్వే మంత్రి గోయల్‌ బుధవారం ప్రారంభించారు. కోరాస్‌ కమెండోలకు అంతర్జాతీయ శిక్షణ ఇవ్వాల్సిందిగా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్పీఎఫ్‌)కు సూచించినట్లు తెలిపారు. కోరాస్‌ యూనిట్‌ను మొదట ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతంలో మోహరించనున్నట్లు వెల్లడించారు. కశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉండే ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, బిహార్‌ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కమాండోలు భవిష్యత్‌లో సేవలు అందించనున్నట్లు తెలిపారు. రైల్వేలకు నష్టం, అంతరాయం, రైళ్లపై దాడి, హైజాక్, విపత్తులకు సంబంధించిన ఏ పరిస్థితుల్లో అయినా కమాండోలు సేవలు అందిస్తారని ఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు