రియల్ ఎస్టేట్ బిల్లును గట్టెక్కిస్తాం

3 Mar, 2016 02:44 IST|Sakshi
రియల్ ఎస్టేట్ బిల్లును గట్టెక్కిస్తాం

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లోనే రియల్ ఎస్టేట్ బిల్లుకు ఆమోదం లభిస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర మంత్రి  వెంకయ్య వ్యక్తం చేశారు. ఈ బిల్లును పార్లమెంటరీ స్ధాయీ సంఘం, సెలెక్ట్ కమిటీలు పరిశీలించి నివేదిక లు అందజేశాయని విలేకరులతో చెప్పారు.

జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ద్వారా కేంద్ర సాయాన్ని అందుకోవడంలో రాష్ట్రాల జాప్యంపై ఆవేదనచెందారు. ప్రణాళిక, వాటి అమలు సామర్థ్యాలను రాష్ట్రాలు పెంపొందించుకోవాలన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, అటల్ మిషన్, స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్ కింద కేంద్రం హామీ ఇచ్చిన విధంగా నిధులను అందిస్తామని, రాష్ట్రాలు కేంద్రం అందించిన నిధులను త్వరగా ఖర్చుచేసి, మరిన్ని నిధుల కోసం కోరాలని సూచించారు.

మరిన్ని వార్తలు