‘ఇష్రత్’ అఫిడవిట్ మార్చటంలో చిదంబరం, మన్మోహన్, సోనియాల పాత్ర..

3 Mar, 2016 02:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసులో అఫిడవిట్‌ను మార్చాలన్న నిర్ణయాన్ని రాజకీయ స్థాయిలో తీసుకున్నారని అందులో అప్పటి హోంమంత్రి చిదంబరం, నాటి ప్రధాని మన్మోహన్, సోనియాల పాత్ర ఉందని బీజేపీ ఆరోపించింది. ఈ విషయంలో తమ నిష్కళంకత్వాన్ని నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీకి సూచించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అప్పటి యూపీఏ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థిని వేధించేందుకు, అప్పటి గుజరాత్ సీఎం మోదీని అప్రతిష్టపాలు చేసేందుకు సీబీఐని దుర్వినియోగం చేసిందని ధ్వజమెత్తారు.

 రెండో అఫిడవిట్ మోసపూరితం: జైట్లీ
 ఇష్రాత్ ఎన్‌కౌంటర్ కేసులో యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రెండో అఫిడవిట్ మోసపూరితమైనదని మాజీ కేంద్రమంత్రి చిదంబరంపై జెట్లీ  ధ్వజమెత్తారు. ఇష్రాత్, ఇతర ఆరోపిత లష్కరే ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ నిజమైనదేనని బుధవారం టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు